రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన మధ్యప్రదేశ్ మంత్రి బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ - Madhya Pradesh Minister visited RFC
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16186872-652-16186872-1661342266816.jpg)
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని మధ్యప్రదేశ్ ఖనిజ వనరుల శాఖ మంత్రి బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ సందర్శించారు. తిరుపతిలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కుటుంబ సమేతంగా ఫిల్మ్ సిటీ అందాలను వీక్షించారు. అనంతరం ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీ నిర్మాణమే కాదు, నిర్వహణ కూడా ఎంతో అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. పర్యాటక కేంద్రాల్లో సాధారణంగా పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఫిల్మ్‌సిటీ రహదార్లు, మొక్కలు చూస్తుంటే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. సినిమాల్లో చూసిన దానికన్నా ప్రత్యక్షంగా వీక్షిస్తే ఫిల్మ్‌సిటీ అందాలను ఆస్వాదించవచ్చారు. ఇంత పెద్ద ఫిల్మ్‌సిటీ నిర్మించి చిత్ర, టీవీ రంగాలకు వినియోగించడం పర్యాటకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆతిథ్యం అందివ్వడం తమ అంచనాలకు మించి ఉందన్నారు.
Last Updated : Aug 24, 2022, 7:28 PM IST