పరవళ్లు తొక్కుతోన్న కుంటాల.. చూసి పరవశించకుండా ఉంటారా..? - kuntala waterfalls in adilabad
🎬 Watch Now: Feature Video
kuntala waterfalls: చుట్టూ పచ్చదనం పరుచుకున్న రెండు గుట్టలు.. వాటి నడుమ ఎత్తైన కొండ.. అక్కడి నుంచి జాలువారే జలధార.. పరవళ్ల తాళానికి పిచ్చుకల కుహుకుహుల రాగాలతో ప్రకృతి పాడే ప్రణయ గీతాలు.. పరుగులు పెడుతున్న నీటితో భానుడి కిరణాల సయ్యాటలు.. సిగ్గుతో మెరిసిపోతూ ఉరకలేసున్న నీటి ప్రవాహం.. ఊహించుకుంటేనే సమ్మోహనంతో ఓళ్లు పులకిస్తున్న ఈ దృశ్యాలన్ని ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని కుంటల జలపాతం వల్ల సాక్షాత్కరిస్తాయి. ఇటీవల కురిసిన జల్లులతో పరుగులు పెడుతున్న జలపాతం అందాలు చూసి తరించాల్సిందే..!