కరోనాపై కదనం... స్వీయనిర్బంధంలో తెలంగాణం - hyderabad janatha curfew
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6500240-284-6500240-1584856696382.jpg)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ కదం తొక్కింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ సర్కార్ 24 గంటల కర్ఫ్యూ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు, దుకాణదారులు, పారిశ్రామికవేత్తలు తమతమ సముదాయాలను, పరిశ్రమలను మూసివేసి స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనంతో కిటకిటలాడే ప్రాంతాలు వెలవెలబోయాయి.