కారుతో ఢీకొట్టి మహిళ హత్య.. వివాహేతర సంబంధం గురించి తెలిసిందని.. - మహిళను ఢీకొట్టిన కార్
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా సుఖ్నాథ్ చౌక్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం గురించి తెలిసిందన్న కారణంతో మహిళను కారుతో ఢీకొట్టి చంపేశాడు ఓ వ్యక్తి. గత శనివారం ఈ ఘటన జరిగింది. అనంతరం డ్రైవర్ పారిపోయాడు. తొలుత ఇది ప్రమాదమని భావించగా.. మృతురాలి సోదరుడు దీనిపై పోలీసులను ఆశ్రయించాడు. ఇది హత్యే అని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. చివరకు ఇది హత్యే అని తేల్చారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదే ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌస్‌లో దాగిఉన్న నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు ఆదిల్ ఖాన్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆ విషయం హసీనాకు తెలియడం వల్ల ఆమె ఎక్కడ ఈ విషయాన్ని బయటపెడుతుందో అన్న భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఆదిల్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
Last Updated : Sep 15, 2022, 8:04 PM IST