గినియా పిగ్స్: తోకలేని ఎలుకలు.. చూస్తే కుందేళ్లు - కరీంనగర్ డీర్ పార్కులో గినియా పిగ్స్
🎬 Watch Now: Feature Video
సాధారణంగా పందులు అంటే అందరు కాస్త వికారమైన ఎక్స్‌ప్రెషన్ పెడతారు. కానీ కరీంనగర్ డీర్ పార్కులో మాత్రం వీటిని చూడటానికే ప్రత్యేకంగా సందర్శకులు తరలివస్తున్నారు. అదేంటి వరాహాలను చూడటానికి వరస కట్టడమేంటి అనుకుంటున్నారా.. ఇవి సాధారణ పందులు కాదండీ.. గినియా జాతి వరాహాలు. ఎలుకల జాతికి చెందిన ఈ జంతువులు చూడటానికి కుందేళ్లలా ఉంటాయి. కుందేళ్లలా గెంతుతున్న ఈ గినియా పిగ్స్‌ని చూసి సందర్శకులు మైమరిచిపోతున్నారు. పిల్లలంతా వాటి చుట్టూ చేరి కేరింతలు కొడుతున్నారు.