అందమైన భామలు.. అదరగొట్టే క్యాట్‌వాక్ - Graduate Fashion Week 2022 in Hyderabad
🎬 Watch Now: Feature Video
విద్యార్థులు.. తాము రూపొందించిన వస్త్రాలకు మోడల్స్‌గా మారి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. సంప్రదాయ, ఆధునిక రంగు రంగుల వస్త్రాలు ధరించి హంసనడకలతో ఆకట్టుకున్నారు. ప్రాచీన థీమ్ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో "గ్రాడ్యుయేట్ ఫ్యాషన్ వీక్ 2022" పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఎఫ్‌డీడీఐ విద్యార్థులు రూపొందించిన పలు విభిన్న రకాలైన డిజైన్‌లను ప్రదర్శించి ఫ్యాషన్ ప్రియులను అలరించారు. ప్రాచీన కళలు, వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.