నిండుగా గోదారి.. కనులవిందుగా భద్రాద్రి.. సుమనోహర దృశ్యాలు మీరూ చూడండి.. - భద్రాచలం
🎬 Watch Now: Feature Video
గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో.. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో ప్రస్తుతం.. గోదావరి నీటిమట్టం 52 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నిండుగా ప్రవహిస్తోన్న గోదారితో భద్రాద్రి ప్రాంతం అత్యంత సుందరంగా కనువిందు చేస్తోంది. మరోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరద వస్తుండడంతో నీటిమట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి వివిధ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉగ్రరూపం దాల్చిన గోదారి ప్రవాహాన్ని మీరూ చూడండి.