చెలరేగిన మంటలు.. కారు దగ్ధం.. ఆ నలుగురు మాత్రం..! - కారు దగ్ధం
🎬 Watch Now: Feature Video
Road accident news: కర్ణాటకలోని హుబ్లీలో ఓ కారు ఘోర ప్రమాదానికి గురైంది. డివైడర్ను ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఆటోను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్నాక పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.