నగర తటాకాల్లో విదేశీ అతిథుల సరాగాలు - foreign birds
🎬 Watch Now: Feature Video
పొద్దంతా ఎండతో సతమతమైన నగర వాసులకు సాయంత్రం వేళ తటాకాల్లో సందడి చేస్తున్న విదేశీ అతిథులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హైదరాబాద్ అమీన్పూర్ చెరువులో విదేశీ పక్షుల సందడి మొదలైంది. వేలమైళ్ల దూరం ప్రయాణించి వచ్చిన ఫ్లెమింగో పక్షులు నగర చెరువుల్లో విహరిస్తూ చూపరుల మనసు దోచుకుంటున్నాయి. ఏటా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా నుంచి వలస వచ్చి మే వరకూ ఇక్కడే ఉంటాయి. ఎర్రని కాళ్లు, గులాబీ రంగు ముక్కు చూడగానే ఆకట్టుకునే రూపంతో పక్షి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.