ప్రతిధ్వని: బిహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? - prathidwani debates
🎬 Watch Now: Feature Video

ఎన్నికల సమయం సమీపిస్తుండడం వల్ల బిహార్‌లో రాజకీయ సమరం ఊపందుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల ప్రచారంతో మరింతగా జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించాయి. అటు నితీశ్‌కుమార్.. ఇటు తేజస్వీయాదవ్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్డీఏ, మహాకూటమిలు రసవత్తర సమరానికి సంసిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీలు గట్టి పోటీనిచ్చేందుకు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల సమరంపై ప్రతిధ్వని చర్చ.