Prathidhwani: రాష్ట్రంలో ఎన్నిరకాల వైద్య వ్యవస్థలు పని చేస్తున్నాయి? - రాష్ట్రంలో ఎన్నిరకాల వైద్య వ్యవస్థలు పని చేస్తున్నాయి
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్యులుగా నియమితులయ్యే వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం నిషేధం విధించింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు, స్పెషలిస్టు వైద్య సేవలను ఈ ఆంక్షల పరిధిలోకి తెచ్చారు. అయితే... ఇప్పటికే ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యులను మాత్రం నిషేధం పరిధి నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఎన్నిరకాల వైద్య వ్యవస్థలు పని చేస్తున్నాయి? వాటిలో వైద్యులకు ఎన్నిరకాలుగా వేతనాలు చెల్లిస్తున్నారు? ప్రైవేటు ప్రాక్టీస్ వద్దనుకుని సర్వీసులో చేరుతున్న యువ వైద్యలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.