Prathidhwani: వరద పోటైతే తగ్గింది కానీ.. బాధితులకు సాంత్వన ఏది? - Help for Flood Effected People
🎬 Watch Now: Feature Video
ఇటీవల గోదావరి పరీవాహక ప్రాంతంలో ముంచెత్తిన వరదలు తీరని కష్టం మిగిల్చాయి. రోజులు గడుస్తున్నా... వరద పోటైతే తగ్గింది కానీ... బాధితులకు సాంత్వన అన్నది కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఎటు చూసినా బురద, వరద తాకిడికి ధ్వంసమైన ఇళ్లు. నేలకొరిగిన పంట చేలు. ఈ పరిస్థితుత్లో బతుకు బండిని ముందుకు నడిపించేదెలా? అందరిలోనూ ఇదే ప్రశ్న. మరి వారిలో ప్రభుత్వం ప్రకటించిన తక్షణ సాయం ఎంత మందికి అక‌్కరకొచ్చింది? వరద బాధితులకు క్షేత్రస్థాయిలో ఇప్పుడు జరగాల్సిన మేలు ఏంటి..?