నదిలో బోల్తా పడ్డ స్కూల్ విద్యార్థుల బోటు.. ఒక్కసారిగా 25 మంది పిల్లలు! - బోటు బోల్తా
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని అనూప్పుర్ జిల్లాలోని బకేలి గ్రామంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ బోటు.. సోన్ నదిలో బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న సుమారు 25 మంది పిల్లలు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. వెంటనే గమనించిన కొంతమంది స్థానికులు నదిలో దూకి.. నీట మునిగిన వారిని కాపాడారు. కొందరు విద్యార్థులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరూ గల్లంతు అవ్వకపోవడం వల్ల వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.