అప్పటివరకు సరదాగా కబుర్లు.. క్షణాల్లోనే సీన్ రివర్స్.. లక్కీగా... - డ్రైనేజీలో పడిపోయిన యువకులు
🎬 Watch Now: Feature Video
5 people fell in the drain: రాజస్థాన్ జైసల్మేర్లో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఓ పంచర్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓవ్యక్తి బైక్కు పంచర్ వేస్తుండగా.. మరో నలుగురు యువకులు పక్కనే నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో వారి బరువుకు డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్ విరిగిపోయింది. దీంతో ఐదుగురు మురికి కాలువలో పడిపోయారు. ఓ బైక్ కూడా వారిపై పడిపోయింది. అయితే, స్వల్పమైన గాయాలతోనే వీరంతా బయటపడ్డారు.