Viral Video కష్టాలు ఊరికే రావు పెళ్లి చేసుకుని ఎన్ని తిప్పలు పడ్డాడో పాపం - పెళ్లి కష్టాల గురించి బైక్‌పై ప్రచారం
🎬 Watch Now: Feature Video
డబ్బులు ఊరికే రావు, ఈ డైలాగ్ తెలియనివారుండరు. కానీ, ఇది పాతదైపోయింది. మార్కెట్లోకి కొత్త స్లోగన్ వచ్చేసింది. పెళ్లి అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నాడో కళ్యాణమనే కష్టాల ఊబిలో మునిగిపోయాడో, లగ్గంతో తిప్పలు అనే సబ్జెక్టులో పీహెచ్డీ చేశాడో వివాహం బంధంతో విసిగి వైరాగ్యం పుచ్చుకున్నాడో, తెలియదు కానీ తన అనుభవాన్ని రంగరించి సమాజానికి సైలెంట్‌గా స్లేట్తో సందేశాలిస్తున్నాడు. కష్టాలు ఊరికే రావు,పెళ్లి చేసుకుంటేనే వస్తాయి, భార్యలు తుఫాన్లాంటోళ్లు గొడుగు పట్టుకుని నిల్చుంటే కష్టం, అంటూ వినూత్న కొటేషన్లతో ఓ వాహనదారుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బైక్ వెనుక ఓ పలకను పెట్టి దానిపై ఇలాంటి కొటేషన్లు రాసుకుని తిరుగుతున్నాడు. కాస్తా విచిత్రంగా ఉన్నా నిజమే చెప్తున్నాడనుకున్న ఇంకో ఔత్సాహికుడు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఇంకేముంది ఆ కొటేషన్లతో కనెక్టయిన వాళ్లంతా ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకెందుకాలస్యం మీరూ ఓ లుక్కేయండి.
Last Updated : Aug 13, 2022, 12:03 PM IST