03:03:33 సెకన్లు తలకిందులుగా యోగాసనం.. ప్రపంచ రికార్డు నమోదు..
🎬 Watch Now: Feature Video
Yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్లోని చార్మినార్ ముందు తలక్రిందులుగా యోగా చేసి సోనూకుమార్ అనే యువకుడు నయా రికార్డు సృష్టించాడు. 3గంటల, 3నిమిషాల, 33సెకండ్లు లక్ష్యంగా పెట్టుకుని యోగా చేసి ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. గత 6 సంవత్సరాల నుంచి రోజు కొన్ని నిమిషాలు సాధన చేస్తున్న ఆ యువకుడు ఈ రోజు చార్మినార్ వద్దకు వచ్చి ఆ ఆసనం వేశాడు. నయా రికార్డు సృష్టించిన ఆ యువకుడిది బిహార్ రాష్ట్రంలోని గొస్తాస్ జిల్లా నిర్పూర్ గ్రామం.
Last Updated : Jun 21, 2022, 1:02 PM IST