కోచింగ్​కు​ వెళ్లొస్తుండగా విద్యార్థినిపై కాల్పులు, నడిరోడ్డుపైనే - బిహార్​ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2022, 11:29 AM IST

Updated : Aug 18, 2022, 1:56 PM IST

కోచింగ్​ అనంతరం ఇంటికి వెళ్తున్న 16 ఏళ్ల విద్యార్థినిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన బిహార్​ పట్నాలోని సిపారా ప్రాంతంలోని ఇంద్రాపురి వద్ద జరిగింది. గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోచింగ్​ అయిపోయాక ఇంటికి వెళ్తుండగా.. విద్యార్థినిని వెంబడించిన దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో యువతి మెడపై కాల్పులు జరిపాడు. యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం వల్ల అక్కడినుంచి పరారయ్యాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
Last Updated : Aug 18, 2022, 1:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.