బతుకమ్మ పరిమళాలతో పరవశించిన మలేషియా - మలేషియాలో ఘనంగా బతుకమ్మ పండుగ
🎬 Watch Now: Feature Video

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగను ప్రవాసులు వైభవంగా జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్లో సద్దుల బతుకమ్మ సంబురాలను ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను చేసి ఒక చోట పేర్చారు. పసుపుతో గౌరమ్మను చేసి ప్రజలందరినీ చల్లగా చూడమని మొక్కకున్నారు. అనంతరం ప్రవాసులంతా బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడారు. రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ బతుకమ్మ సంబురాలను విజయవంతం చేసేందుకు సహకరించిన వాలంటీర్లను మైట ప్రెసిడెంట్ అభినందించారు.