ఆయనే నా ప్రపంచం.. తనే నా హృదయం: మీనా - మీనా భర్త మృతి
🎬 Watch Now: Feature Video
సినీనటి మీనా భర్త హఠాత్మరణంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వారి వైవాహిక జీవితంపై నెట్టింట చర్చ జరుగుతోంది. వారిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2009 జులై 12న వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2011లో వీరికి నైనిక జన్మించింది. ఆమె కూడా తమిళ్లో 'తెరీ' అనే చిత్రంతో అరంగేట్రం చేసింది. భర్తే తన ప్రపంచం అని.. కుమార్తె నా హృదయం అంటూ కొన్నాళ్ల క్రితం అలీతో సరదాగా కార్యక్రమంలో తన కుటుంబం గురించి చెప్పుకుని సంతోషపడ్డారు మీనా. ఇలా అంతా బాగుందన్న టైంలో పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల మీనా భర్తకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయింది. అది కాస్తా కరోనాతో తీవ్రమవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. 13 ఏళ్ల వివాహ బంధం.. ఓ పాప.. ఇలా అంతా బాగుందన్న సమయంలో మీనా ఇంట విషాదం నెలకొనడం దురదృష్టకరమని సినీప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.