Prathidhwani: రాష్ట్రం కట్టే పన్నులెంత? కేంద్రం ఇస్తున్న నిధులెంత? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13075841-606-13075841-1631721641544.jpg)
ప్రభుత్వ పథకాల్లో కేంద్రం, రాష్ట్రాలు వెచ్చిస్తున్న నిధుల వాటాలపై భాజపా, తెరాసల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్య పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల చలవేనంటూ బీజేపీ విమర్శిస్తోంది. అసలు తెలంగాణ చెల్లిస్తున్న పన్నుల్లో సగం కూడా తిరిగి రాష్ట్రానికి రావడం లేదని తెరాస ప్రభుత్వం ప్రత్యారోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయ పంపిణీకి ప్రాతిపదిక ఏంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నిధుల కేటాయింపులు, విడుదల విధివిధానాలు ఎలా ఉంది? రాష్ట్రంలో పన్నులు, నిధుల వాటాలపై బీజేపీ, తెరాస మధ్య వాగ్వాదానికి కారణమేంటి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.