నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన విద్యార్థులు.. కొద్దిలో..! - The students were washed away in a stream of water
🎬 Watch Now: Feature Video
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. బడి వదలగానే ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి లో లోవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండగా.. విద్యార్థులు ఆ వంతెనను దాటే ప్రయత్నం చేశారు. ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. పక్కనే పొదల్లో చిక్కుకుని కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు.