Prathidwani: మారుతున్న ట్రెండులో ఫ్రెండు గొప్పతనం ఏంటి..? - స్నేహితుల దినోత్సవం వార్తలు
🎬 Watch Now: Feature Video
నిన్ను నవ్వించి.. నువ్వు నవ్వుతుంటే.. ఆ సంతృప్తితో తనూ నవ్వుకునే స్వచ్ఛమైన బంధం స్నేహం. బాధలో నువ్వుంటే.. దిగులు పడకు నేనున్నాంటూ.. తోడు నిలిచే ధైర్యం స్నేహం. నిరుత్సాహం నిన్ను కమ్మేసినప్పుడు.. నువ్వు సాధించగలవని వెన్నుతట్టే ప్రోత్సాహమే స్నేహం. నువ్వు నవాబైనా... గరీబైనా... ఎప్పటికీ నిన్ను నిన్నుగా గుర్తించే సత్యమే స్నేహం. నిత్యం నీకు తోడుగా నిలిచి.. అనుక్షణం నీ అభ్యున్నతి కోరుకునే స్నేహం దొరికితే.. అంతకంటే గొప్ప ఆస్తి ఏముంటుంది. అంతటి మహత్తరమైన బంధానికి తీపి గుర్తే... ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అసలు మన ప్రయాణంలో ఇంతలా పెనవేసుకునే ఫ్రెండు గొప్పతనం ఏంటి ? నిజమైన స్నేహితుడో, స్నేహితురాలో దొరికితే.. ఆ జీవితం ఎంత అందంగా ఉంటుంది. ఒకసారి తరచి చూసుకునే ప్రయత్నమే నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని.