నిన్న లేని అందమేదో... - PRASAD
🎬 Watch Now: Feature Video

ఆయన పాట పాడితే ఎదలో వేయి వీణలు మోగినట్లుంటుంది. ఆయన గానం కోకిల గొంతులోని మాధుర్యాన్ని తలపిస్తుంది. నిన్న లేని అందమేదో.. అంటూ స్వరం విప్పితే ఊహల లోకంలో విహరించినట్టు ఉంటుంది. కానీ ఆయన్ని చూస్తే మాత్రం మనసు చలిస్తుంది. చిన్నతనంలోనే కంటి చూపు పోగొట్టుకున్నా... మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న బతుకు ప్రయాణం ఎందరికో ఆదర్శం. రోడ్లపై పాట కచేరి చేస్తూ... అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ, అందులోనే ఆత్మ సంతృప్తిని... జీవనోపాధిని వెతుక్కుంటున్న ప్రసాద్‌కు హ్యాట్సాఫ్...