Fashion Show: హంస నడకలతో హోయలొలికించిన ముద్దుగుమ్మలు - హంస నడకలతో హోయలొలికించిన ముద్దుగుమ్మలు
🎬 Watch Now: Feature Video

హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ హోటల్‌లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు హైలైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 600 మంది డిజైనర్లు డిజైన్ చేసిన నూతన వస్త్రాభరణాలను నగర ఫ్యాషన్ ప్రియులకు అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రికను బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వర్థమాన సినీ తారలు రిచాసింగ్, జెన్నీ ఆవిష్కరించారు. తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న రిచాసింగ్, జెన్నీ మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌పై హొయలొలికించారు.