ప్రతిధ్వని: వరదలతో పంట నష్టమెంత.. ప్రభుత్వాలు ఏంచేయాలి..? - etv prathidwani debates
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. కృష్ణా, గోదావరి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల లక్షల ఎకరాల పంట.. నీట మునిగింది. తెలంగాణలో పత్తి, మిరప, కంది వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఏపీలో పత్తి, మిరప, వరి, ఉద్యానవన పంటలు నీటమునిగాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో పంట నష్టం జరిగింది.. ఏఏ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. ఈ దశలో పంటలను కాపాడుకునే అవకాశం ఎంత వరకు ఉంది.. ప్రభుత్వాలు.. రైతులను ఏ మేరకు ఆదుకోవాలి.. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.