ప్రతిధ్వని: సామాజిక వ్యాప్తి దశలో కరోనా.. అప్రమత్తతే శరణ్యం - ప్రతిధ్వని చర్చలు
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా సామాజిక వ్యాప్తి దశ ప్రారంభమైందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అప్రమత్తంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు కొవిడ్ కేసుల రికవరీ రేటు కూడా పెరుగుతోంది. దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రతి ఒక్కరు కచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ, మరింత అప్రమత్తతపై ప్రతిధ్వని చర్చ.