prathidhwani: రాష్ట్రంలో గోదాముల కొరత.. లక్షలాది టన్నుల కొత్తధాన్యం ఎక్కడ నిల్వ చేస్తారు? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు గోదాముల కొరత అదనపు సమస్యగా మారింది. గత యాసంగిలో సేకరించిన ధాన్యం పాత నిల్వలు ఇంకా గోదాముల్లోనే మగ్గుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో కొత్తగా కొనుగోలు చేస్తున్న పంటల నిల్వకు ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో రా రైస్, ఉప్పుడు బియ్యం కొనుగోళ్లపై ప్రభుత్వాల విధానాల్లో మార్పులు రావడంతో గోదాముల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. కానీ... రైతులు ఇప్పటికే రోడ్లపైనే ధాన్యం రాశులుగా పోసుకుని అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు విషయంలో భాజపా, తెరాస పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. అసలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గోదాములు ఎన్ని? వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన సామర్థ్యం వాటికి ఉందా? వరి రైతుల మార్కెటింగ్ కష్టాలు తీరెదెలా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని(prathidhwani) చర్చా కార్యక్రమం.