ప్రతిధ్వని: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టం - భారత్ డిబేట్
🎬 Watch Now: Feature Video
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో.. నగరం ప్రత్యక్ష నరకాన్ని తలపించింది. చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలాలు పొంగి పొర్లాయి. రహదారులు చెరువులయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నదులు, వంకలు, వాగులు పొంగి పొర్లడంతో.. రెండు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, పత్తి, మిరప, ఉద్యానవన పంటలు.. తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంపై.. ప్రతిధ్వని చర్చను చేపట్టింది.