FIGHT: చిర్రెత్తుకొచ్చింది... చితకబాదింది! - vishaka updates
🎬 Watch Now: Feature Video
విశాఖ నగరం ఆరిలోవలో ఓ వ్యక్తిని మహిళ చితకబాదిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్రాంతి నగర్లోని ఓ దుకాణ యజమానురాలైన మహిళపై.. రామకృష్ణ అనే యువకుడు తాగి వచ్చి దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. సహనం కోల్పోయిన ఆ మహిళ తిరగబడి ఆ వ్యక్తిని చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.
Last Updated : Aug 13, 2021, 3:07 PM IST