Prathidwani: తెరాస – భాజపా.. ఎవరి వాదనల్లో నిజం ఎంత?
తెరాస వర్సెస్... భాజపా. చూస్తుండగానే పతాకస్థాయికి చేరింది... ఈ పోరు. మాటలతూటాలు అయిపోయాయి. ఇప్పుడు నేరుగా సై అంటే సై... ఢీ అంటే ఢీ అంటున్నారు... ఇరుపార్టీల నేతలు. అప్పుడెప్పుడో ఉప ఎన్నికలు.. ఇటీవల వరి పోరుతో రాజుకున్న ఈ వేడి... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో మరింత పెరిగింది. భాజపా నాయకులపై కేసులు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ, అడ్డగింతలు పోరు తీవ్రత ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. కొవిడ్ కారణంగా ఎవరికీ యాత్రలకు అనుమతి లేదని తెరాస ప్రభుత్వం అంటూ ఉంటే.. ఎలాగైనా ర్యాలీలు తీసి తీరాతాం అంటున్నారు... భాజపా నాయకులు శ్రేణులు. అసలు ఈ రాజకీయ రణం ఇంతవరకు ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడ మొదలైంది... ఎక్కడి వరకు దారి తీయనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.