Prathidwani: ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమం... ఆచరణ ఎలా?
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయాలని.. అందుకు సంబంధించి... విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ మార్పు అనివార్యం అంటోంది... సర్కార్. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దడానికి ఇంతకు మించి మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది రాష్ట్ర మంత్రిమండలి. ఈ పరిణామాల్ని ఎలా చూడాలి? పిల్లల భవిష్యత్ రీత్యా ఇది తప్పనిసరి అంటున్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించే వారితో పాటే... విబేధిస్తున్న వారి అభ్యంతరాలు ఏమిటి? విద్యా వ్యవస్థలో తలపెట్టిన మార్పులు ఎలా ఉంటే అందరికీ మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.