తొలిసారిగా ఫుట్‌బాల్ స్టేడియంలో ఇరాన్ మహిళలు - football latest news
🎬 Watch Now: Feature Video
40 ఏళ్ల నిబంధనను రద్దు చేస్తూ తొలిసారిగా ఫుట్‌బాల్ స్టేడియాల్లోకి స్త్రీలను అనుమతించింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్-కంబోడియా మధ్య గురువారం జరిగిన 2022 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై సందడి చేశారు.
ఇదీ కారణం..!
మహిళల స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించకపోతే అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి ఇరాన్‌ను బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించింది. అందుకే మ్యాచ్‌లను స్టేడియంలో చూసేందుకు స్త్రీలను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది ఇరాన్.