YSRCP Spreading Fake News Against Chandrababu: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా వైసీపీ.. ఫేక్ ఫోన్ కాల్‌పై టీడీపీ నేతల ఆగ్రహం.. - వైసీపీపై టీడీపీ నేతల ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 3, 2023, 1:16 PM IST
YSRCP Spreading Fake News Against Chandrababu: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా వైసీపీ తెగబడుతోందని.. ఆ మేరకే దుష్ప్రచారలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. వైసీపీ చంద్రబాబుపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. కల్పిత ఫోన్ సంభాషణలను సృష్టించి.. ప్రజలలోకి వదిలిపెడ్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందంటూ ఇద్దరు యువతీ, యువకులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఆ రికార్డులను.. వైసీపీ నేతలు ప్రజలకు ఫోన్ల ద్వారా వినిపిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. ఇద్దరి మధ్య సాగిన ఆ సంభాషణలు సాధారణ సంభాషణలు కావని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 2017లోనే స్కిల్ కేసు ప్రాజెక్టు అక్రమాలు జరిగియాని.. ఆ యువతి యువకులు మాట్లాడుకున్నారని దానినే ఫోన్ కాల్ రూపంలో వినిపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులే ఆ స్క్రిప్ట్ తాయరు చేశారని ఆరోపించారు. అందుకు అనుగుణంగానే వారి పేటీఎం బ్యాచ్‌తో మాట్లాడించి రికార్డ్ చేశారని.. దానిని ఇప్పుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని విమర్శించారు.