రూ.20వేల అప్పు కోసం 40 అడుగుల చెట్టెక్కిన యువకుడు.. 9గంటల తర్వాత ఏమైందంటే?
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్- చంపా జిల్లాలో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. అప్పుల బాధతో సూసైడ్ చేసుకుందామనే ఆలోచనతో ఏకంగా 40 అడుగుల ఎత్తైన రావి చెట్టు మీదకు ఎక్కాడు. చెట్టుపై ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకొని గుమిగూడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి ఎస్డీఆర్ఎఫ్ బృందంతో చేరుకున్నారు బలోడా పోలీసులు. 9 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్ ఎట్టకేలకు పొడవైన నిచ్చెన సాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించింది.
జిల్లాలోని మదన్‌పుర్ గ్రామానికి చెందిన రామ్ గోపాల్ యాదవ్ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైనాపుర్ గ్రామంలోని ఓ ఎత్తైన రావి చెట్టును ఎక్కి గట్టిగా అరిచినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయం తీసుకున్నానని రామ్ చెప్పాడు. చెట్టుపై నుంచి కిందకు దింపిన రామ్ గోపాల్ యాదవ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే చెట్టుపైకి ఎక్కిన యువకుడికి 7 గంటల తర్వాత తినడానికి సమోసా, నీళ్లను అందించారు అధికారులు. అయితే రామ్ గోపాల్ యాదవ్, అతడి భార్య అనితా యాదవ్ గత 5 సంవత్సరాలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ఇటుక బట్టీలో కార్మీకులుగా పనిచేస్తున్నారు. అయితే తన భర్త మానసిక పరిస్థితి బాగాలేదని రామ్ భార్య తెలిపింది.