కార్తిక మాసంలో యాదాద్రికి భారీ ఆదాయం - ఎంతంటే? - Yadadri Temple News
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 12:08 PM IST
Yadadri Kartika Masam Income 2023 : కార్తిక మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఖజానాకు రూ.14.91 కోట్లు వచ్చాయని ఆలయ ఈవో గీత తెలిపారు. నవంబర్ 14న మొదలైన కార్తిక మాసం ఈ నెల 12న మంగళవారంతో ముగిసింది. శివ, కేశవుల ఆలయాలున్న ఈ క్షేత్రం సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు, దీపోత్సవం, తులసీ ఆరాధనలతో, భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తిక మాసం తొలి రోజు నుంచి రోజూ ఆరు సార్లు నిర్వహించిన సామూహిక వ్రతాల్లో 18,824 మంది దంపతులు పాల్గొన్నారు.
Yadadri Temple Hundi Income : ఈ పూజలతో రూ.1,64,20,600 సమకూరాయని ఆలయ ఈవో గీత తెలిపారు. 37,698 మంది భక్తులు తల నీలాలు సమర్పించారని, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,50,79,660 ఆలయ ఖజానాకు సమకూరాయని చెప్పారు. బ్రేక్, శీఘ్ర దర్శనాలతో రూ.1,69,19,100 రాగా, కొండపై వాహనాల పార్కింగ్ రుసుం ద్వారా రూ.1,13,50,000 వచ్చాయని దేవాలయ ఈవో గీత వివరించారు.