Wrestlers Clash In Hyderabad : కుస్తీ పోటీల్లో పహిల్వాన్‌ల మధ్య గొడవ.. ప్రేక్షకులకు గాయాలు - telangana latest news
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2023, 1:18 PM IST
Wrestlers Clash In Hyderabad : హైదరాబాద్‌లో ఇద్దరు పహిల్వాన్ల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బషీర్‌బాగ్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా జరుగుతున్న మోదీకేసరి కుస్తీ పోటీల్లో శుక్రవారం రోజున ఘర్షణ చోటుచేసుకుంది. ఓ పక్క మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరు పహిల్వాన్ల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. పహిల్వాన్లకు సంబంధించి ఇరు వర్గాలు దాడులకు దిగడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో పలువురి ప్రేక్షకులకు గాయాలయ్యాయి. గొడవతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. గొడవకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణతో పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈరోజు పోటీలు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.