World Cup Trophy Tour : తాజ్‌మహల్ ముందు ప్రపంచకప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ సందడే సందడి
🎬 Watch Now: Feature Video
World Cup Trophy Tour : భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమౌతోంది. ఈ క్రమంలో అటు బీసీసీఐతో పాటు ఇటు ఐసీసీ ఈ వేడుకల కోసం సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమవ్వనందున ప్రమోషనల్ ఈవెంట్లను సైతం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 18 దేశాలను చుట్టిరానున్న వరల్డ్ కప్ ఇప్పుడు ఆగ్రాకు చేరుకుంది. ఆగ్రాలోని ప్రసిద్ధ కట్టడమైన తాజ్ మహల్ ముందు బుధవారం కనువిందు చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఫొటో షూట్ కోసం తాజ్ మహాల్ ముందు ప్రదర్శంచిన ఆ కప్‌ను చూసేందుకు క్రికెట్ లవర్స్ తరలివచ్చారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ కాసేపు అక్కడే ఉండిపోయారు.
World Cup 2023 Trophy : జూన్ 27న భారత్‌లో ప్రారంభమైన ఈ ట్రోఫీ టూర్ ఇప్పుడు ఆగ్రాకు చేరుకోవడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ పర్యటన ముగించుకుని ఈ ట్రోఫీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ఎ, వెస్టిండీస్, పాకిస్థాన్, ఫ్రాన్స్, పాపువా న్యూ గినియా, ఇటలీ సహా 18 దేశాలకు వెళ్లనుంది. ఆ తర్వాత తిరిగి సెప్టెంబర్ 4న భారత్ చేరుకోనుంది. బీసీసీఐ- ఐసీసీ సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మందికి ఈ ట్రోఫీని నేరుగా చూసే అవకాశం కలగనుంది.