Women Washed Away in Mahbubnagar Viral Video : వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన మహిళలు.. 6 గంటల పాటు టెన్షన్‌ టెన్షన్‌.. చివరకు! - మహబూబ్‌నగర్‌ వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 9:50 AM IST

Updated : Sep 12, 2023, 11:04 AM IST

Women Washed Away in Mahbubnagar Viral Video : వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు.. దాదాపు 6 గంటల పాటు పోరాడి మృత్యుంజయులుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిలివేరు గ్రామానికి చెందిన నీలమ్మ (55), సుగుణమ్మ (35) నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఆవంచ గ్రామానికి వెళ్లారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో తిరిగి గ్రామానికి వస్తూ మార్గమధ్యలో ఉన్న దుందుభి వాగు దాటుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో కొట్టుకుపోయారు.

Women Were Rescued After Washing Away in Mahbubnagar :  వాగు మధ్యలోని చెట్ల కొమ్మలను పట్టుకుని కేకలు వేశారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. గ్రామస్థులు, అధికారులకు సమాచారం అందించారు. ఎమ్మార్వో రాజునాయక్, ఎస్సై శివ నాగేశ్వర్‌ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జిల్లా పాలనాధికారికి సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ రెస్క్యూ సిబ్బంది మరబోటు సహాయంతో మహిళలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 6 గంటల పాటు నీటిలో ఉండటంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Sep 12, 2023, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.