Woman thief in Yellandu Vegetable Market : కూరగాయల మార్కెట్‌లో చోరీ.. సీసీటీవీకి చిక్కిన మహిళ.. వీడియో వైరల్ - Woman thief in Yellandu Vegetable Market
🎬 Watch Now: Feature Video
Woman thief in Yellandu Vegetable Market : భద్రాద్రి కొత్తగూడెం జిల్వ ఇల్లందు మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు కోసం వచ్చేవారే లక్ష్యంగా ఓ మహిళ తన చేతివాటం ప్రదర్శించింది. ఓ మహిళ పర్సులోని సెల్‌ఫోన్‌తోపాటు 5 వేలు, ఉంగరాన్ని కొట్టేసింది. మార్కెట్‌లోకి పర్సు తీసుకొని వచ్చిన మహిళలను గుర్తించి.. ఏమరపాటుగా ఉండగా తస్కరిస్తూ సీసీ కెమెరాలు చిక్కింది. ఆలస్యంగా గుర్తించిన వినియోగదారులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. చోరీకి పాల్పడిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
'కూరగాయలు కొనేందుకు వచ్చే వారినే ఆ మహిళ టార్గెట్ చేసుకుందని పోలీసులు తెలిపారు. అక్కడికి వచ్చిన వారంతా కూరగాయలు కొనే బిజీలో ఉంటే.. ఈమె మాత్రం వారిని ఓ కంట కనిపెడుతూ.. వారు కాస్త ఏమరపాటుగా ఉన్నారని అనిపించగానే తన చేతికి పని చెబుతుంది. వారికి తెలియకుండా స్మూత్‌గా దోచేస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె చోరీలు చేస్తోంది. తాజాగా కేసుతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. అందులో దొంగతనం చేస్తున్నట్టు క్లియర్‌గా బయటపడింది. త్వరలోనే ఆ కిలేడీని పట్టుకుంటాం' అని పోలీసులు చెబుతున్నారు.