మహిళ వీరంగం.. పోలీసులపై చెప్పుతో దాడి - ఉత్తర్ప్రదేశ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15203187-thumbnail-3x2-meerut.jpg)
Woman Hit Policemen With Slippers: ఉత్తర్ప్రదేశ్ మేరఠ్ జిల్లాలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. స్కూటీపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నందుకు వాగ్వాదానికి దిగి వారిపై చెప్పుతో దాడి చేసింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుమార్తెతో కలిసి వెళ్తున్న మహిళ రాంగ్ రూట్లో ప్రయాణిస్తోంది. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మహిళ ఆగ్రహంతో వారిపై దుర్భాషలాడింది. పోలీసులను చెప్పుతో కొట్టింది. అక్కడే ఉన్న పోలీసులు వీడియో తీశారు. వీడియో ఆధారంగా మహిళపై కేసు నమోదు చేసినట్లు నగర ఎస్పీ వినీత్ భట్నాగర్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST