నేడే వింగ్స్​ ఇండియా ప్రదర్శన - పాల్గొననున్న 106 దేశాల ప్రతినిధులు - Aeroplane Shoe uin Hyderabad 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 10:52 PM IST

Updated : Jan 18, 2024, 6:39 AM IST

Wings India Show 2024 : వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్‌లను ఉంచనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. దాదాపు 5వేల మంది వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

Aerobatic Show at Begumpet Airport 2024 : బేగంపేట విమానాశ్రయంలోనే గతంలో రెండుసార్లు ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనని నిర్వాహకులు తెలిపారు. దేశంలో ఉన్న సాధారణ ప్రజలకు విమాన ప్రయాణాన్ని కల్పించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన హెలికాప్టర్లను వింగ్స్ ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శనగా ఉంచారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ350 విమానాన్ని ఆవిష్కరించనున్నారు. 

Last Updated : Jan 18, 2024, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.