Pipeline damage in Hyderabad : పంపు పగిలి.. పాతాళగంగ పైకి వచ్చింది - మెహదీపట్నంలో పగిలిన పైపులైన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15616151-thumbnail-3x2-a.jpg)
హైదరాబాద్ మెహదీపట్నం వద్ద వాటర్ పైప్లైన్ పగిలింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో భారీగా తాగునీటి వృధా అయింది. పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ నంబర్ 186 వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద ఫౌంటెన్ను తలపించేలా వస్తున్న నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి అప్పటికే రహదారులు జలమయమవ్వగా.. పైపులైన్ పగలడం ద్వారా వచ్చిన నీటితో రోడ్లు చెరువును తలపించాయి. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేయించి మరమ్మతులు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST