Warangal CI lathi charge on hotel owners : హోటల్లో వరంగల్ సీఐ హల్చల్.. లాఠీతో సిబ్బందిపై దాడి - Warangal CI Halchal
🎬 Watch Now: Feature Video
Warangal CI lathi charge on hotel owners : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పౌరలకు ధైర్యం చెప్పాల్సిన రక్షక భటులు కొన్ని కొన్ని సందర్భాలల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సీఐ హల్ చల్ చేశారు.
బాధితుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 10.10 నిమిషాల సమయంలో ఓ హోటల్లోకి వచ్చిన స్థానిక సీఐ.. అక్కడున్న కస్టమర్స్‌తో పాటు యాజమానిపై దురుసుగా ప్రవర్తించారు. ఒకనొక సమయంలో లాఠీతో తమపై దాడి చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలు ప్రకారమే తాము హోటల్స్ నడిపిస్తున్నామని.. రాత్రి 10.30లకే షాప్‌లు మూసివేయాలని సీఐ హుకుం జారీ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. సీఐ తీరుతో కస్టమర్స్‌తో పాటు ప్రజలు భయందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సీఐ లాఠీఛార్జీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.