మద్యం మత్తులో ఒకరిని బలి తీసుకున్న జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్ - GHMC auto Driver accident
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 9:42 PM IST
Viral Video Man Died after GHMC Auto vechicle Hit : ఒకరి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రభుత్వ సంస్థ పరిధిలో పనిచేస్తున్న అనే ఆలోచన లేకుండా మద్యం మత్తులో ఓ జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్ ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఇంటింటి చెత్త సేకరించే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపి రెండు బైక్‌లను, మరో రెండు కార్లను ఢీకొట్టాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో చెంగిచెర్లలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
GHMC Auto Accident at Medipally : వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చికిత్స నిమిత్తం కోసం క్షతగాత్రులను గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన జీహెచ్ఎంసీ చెత్త ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆటోడ్రైవర్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని మేడిపల్లి సీఐ సైదులు తెలిపారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.