Viral Video Drunken Man Hulchal With Car : మద్యం మత్తులో కారు బీభత్సం.. ఆరుగురు వాహనదారులకు గాయాలు - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-08-2023/640-480-19346365-thumbnail-16x9-drunken--man--hulchal--with--car--at--chaderghat.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 24, 2023, 5:28 PM IST
Drunken Man Hulchal With Car Viral Video : హైదరాబాద్ చాదర్ ఘాట్ వంతెనపై రాత్రి ఓ యువకుడు మద్యం తాగి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. చాదర్ ఘాట్ బ్రిడ్జి మీదుగా ర్యాష్ డ్రైవింగ్ చేసి పలు వాహనాలను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా ఓ దుకాణంలోకి దూసుకుపోయాడు. దీంతో రెండు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఆరుగురు వాహనదారులకు గాయాలయ్యాయి. అందులో ఓ దివ్యాంగుడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ది చేసి మలక్పేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఘటన జరిగిన ప్రాంతం చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. ఈ ఘటనతో చాదర్ ఘాట్ మలక్ పేట ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారునడిపిన నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.