Vinod Kumar Hot Comments On BRS Leaders : 'సొంత పార్టీ నేతల వల్లే గత ఎన్నికల్లో ఓటమి' - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 5:32 PM IST
Vinodkumar Hot Comments on BRS Leaders in Karimnagar : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఆయన సభలో ప్రసంగింస్తూ సొంత పార్టీపైనే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. గత ఎన్నికల ప్రచార సమయంలో బండి సంజయ్ పేదల ఫించన్ రూ.1000లో రూ. 800 కేెంద్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారని... ఆ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం వల్లే తాను ఓటమి పాలయ్యానని వాపోయారు. ఈసారి ఎన్నికల్లో అయినా ఇటువంటి పొరపాట్లు జరగకుండా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Vinodkumar Fired on Narendra Modi : అంతరిక్ష పరిశోధనల్లో చంద్రయాన్ సక్సెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఘనతగా చెప్పుకోవడం సరికాదని బోయినపల్లి అన్నారు.