110కి.మీ వేగంతో వెళ్తున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. ప్లాట్​ఫామ్​పై ఈడ్చుకెళ్లి.. - కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 20, 2023, 1:01 PM IST

110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి జారిపడ్డాడు ఓ ప్రయాణికుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్ రైల్వే స్టేషన్​​లో జరిగింది. సుమారు 100 మీటర్ల మేర ప్లాట్​ఫామ్​పై ప్రయాణికుడిని ఈడ్చుకెళ్లింది పాట్లీపుత్ర ఎక్స్​ప్రెస్ రైలు. ఈ ప్రమాదంలో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి సురక్షితంగా బయట పడడం వల్ల ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్​లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు
అంతకుముందు ఒడిశాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కింద పడిపోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే ఉన్న ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడిని కాపాడాడు. ఈ ఘటన ఒడిశాలోని బ్రహ్మపుర రైల్వే స్టేషన్​లో జరిగింది. రైల్వే స్టేషన్​లోని సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అసోంకు చెందిన జయేశ్(34) అనే యువకుడు వేగంగా వెళ్తున్న ప్యాసింజర్​ రైలులో నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అదుపు తప్పి కింద పడిపోయాడు. రైలు కిందకు జారిపోతున్న జయేశ్​ను అక్కడే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సూర్యకాంత్ సాహు రక్షించాడు. జయేశ్.. బ్రహ్మపురలో ప్యాసింజర్ రైలు దిగి చెన్నైకు మరో రైలులో వెళ్లేందుకు ఇలా చేశాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.