Green Wedding Card పర్యావరణ హితంగా వివాహ శుభలేఖ - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17621229-51-17621229-1675081459842.jpg)
తమ వివాహా పత్రిక సాధారణ శైలికి విభిన్నంగా ఉండాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఇలాగే నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లికి ఆహ్వానిస్తూ రూపొందించిన లగ్నపత్రిక ఒకటి వైరల్‌గా మారింది. ‘పర్యావరణ హితం థీమ్’తో ఎంతో సృజనాత్మకంగా రూపొందించిన ఈ వెడ్డింగ్ కార్డ్ అక్కడి వారిని ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలో కాస్తంత విభిన్నంగా ఆలోచించి ఆయన ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా పెళ్లి కార్డులను తయారు చేయించి అతిథులను ఆహ్వానిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నిజామాబాద్ నగరానికి చెందిన సామాజిక సేవకుడు, ప్రకృతి ప్రేమికుడు మంచాల జ్ఞానేందర్ తన కూతురి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే వెడ్డింగ్ కార్డు వినూత్నంగా ఉండాలని అనుకున్నాడు. చాలా మంది వివాహాం అయిపోయిన వెంటనే పెండ్లి పత్రికలను తీసుకువెళ్లి బయట పడవేస్తారు. కానీ అలా కాకుండా ఆ వెడ్డింగ్ కార్డును పూల కుండీలో పెడితే అందులో నుంచి మొక్క వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇందువల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా ఆ విధంగా పెండ్లి పత్రికను ఈ విధంగా డిజైన్ చేయించాడు. తద్వారా పర్యావరణానికి పాటు పడతామని మంచాల జ్ఞానేందర్ తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఆలోచన వచ్చింది అని చెప్పారు. ఈ పెళ్లిపత్రిక ఆకట్టుకునేలా ఉందంటూ అక్కడి వారు మంచాల జ్ఞానేందర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాము ఇలానే ప్రయత్నిస్తామని మరికొందరు అంటున్నారు.