వరదవెల్లి గుట్టను చుట్టిన బ్యాక్ వాటర్ - ద్వీపంలా మారిన దత్తాత్రేయ ఆలయం - The temple in Vardavelli was flooded
🎬 Watch Now: Feature Video
Published : Dec 27, 2023, 1:11 PM IST
Varadavelli Dattatreya Temple in Sircilla District : మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం ద్వీపంలా మారింది. ఈ దృశ్యం భక్తులు, పర్యాటకులు, చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే గుట్ట చుట్టూ జలాశయం వెనుక జలాలు చేరడంతో స్వామి వారికి నిత్యపూజలు నిలిచిపోయాయి. జయంత్యుత్సవాల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 27వరకు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ నిర్వాహకులు భక్త బృందానికి బోటు సదుపాయం కల్పించింది. ఏటా మూడు రోజులు నిర్వహించే దత్తాత్రేయస్వామి జయంత్యుత్సవాలు నేటితో ముగియనున్నాయి.
Rahu Rupa Varadavelli Dattatreya Temple in Sircilla District : మధ్యమానేరు జలాశయం నిర్మాణంలో భాగంగా 2016లో వరదవెల్లి గ్రామం ముంపునకు గురైంది. అప్పటి నుంచి ఆలయం ఉన్న గుట్టను బ్యాక్‌వాటర్ చుట్టుముట్దింది. 40ఏళ్లకు పైగా ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్న భక్తులకు 2016 నుంచి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ముంపునకు గురైనప్పటి నుంచి భక్తులు బోటు సాయంతో ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా గుట్టు చుట్టూ నీరు చేరడం, పచ్చదనం సంతరించుకోవడంతో ద్వీపంలా మారి ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది.