Uppal MLA Ticket Issue in Congress Party : 'కాంగ్రెస్‌ను ఖతం చేయడానికే రేవంత్‌రెడ్డి పార్టీలోకి వచ్చారు' - సోమశేఖర్ రెడ్డికి దక్కని ఎమ్మెల్యే టికెట్
🎬 Watch Now: Feature Video


Published : Oct 15, 2023, 6:58 PM IST
Uppal Ticket Issue in Congress Party : కాంగ్రెస్ పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... ఖతం చేయడానికి వచ్చారంటూ.. ఆ పార్టీ ఉప్పల్ నేతలు భగ్గుమన్నారు. ఉప్పల్ టికెట్ దక్కకపోవడంతో... కాంగ్రెస్ ఉప్పల్ బ్లాక్ అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు రేవంత్ రెడ్డి బలం కోసం పనిచేశా అని.. రేపటి నుంచి రేవంత్ పతనం కోసం చేస్తానని హెచ్చరించారు. సర్వేలు నిర్వహించి మెజారిటీ వచ్చిన వారికి ఇవ్వకుండా వేరేవారికి ఇచ్చారని మండిపడ్డారు. వారికి టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వారి నోటి నుంచే చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీలో ఎంతో కాలంగా పని చేస్తున్న నాయకులకు టికెట్ ఇవ్వకుండా.. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తుంటే.. ఉప్పల్ టికెట్ రాకుండా రేవంత్‌రెడ్డి చేశారంటూ... మరోనేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నేతలకు ఇవ్వకుండా ఇతరులకు టికెట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.